కాంగ్రెస్ పార్టీపై శర్మిష్ట ముఖర్జీ కూతురు ఫైర్

4
- Advertisement -

కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు. కానీ కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారు అన్నారు. అప్పటి సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీ రాశారు అని కానీ .. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు.

బిజెపికి చెందిన సి.ఆర్. కేశవన్ పోస్ట్‌ను శర్మిష్ఠ ముఖర్జీ ప్రస్తావించారు. ప్రణబ్ “గాంధీ” కుటుంబంలోని సభ్యులు కానందున పార్టీలోని ఇతర రాజనీతిజ్ఞులను కాంగ్రెస్ ఎలా విస్మరించిందో హైలైట్ చేయగా దానికి రిప్లై ఇచ్చారు శర్మిష్ట.

ఈ అంశంపై, 2004 నుండి 2009 వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు మరియు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ డాక్టర్ సంజయ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని ప్రస్తావించారు, 2004లో మరణించిన మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఢిల్లీలో ఎప్పుడూ స్మారక చిహ్నాన్ని నిర్మించలేదని తెలిపిన అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు.

Also Read:నితీష్ రెడ్డి..తొలి సెంచరీ

- Advertisement -