మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి

1
- Advertisement -

మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్ సింగ్ కు నివాళులు అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇవాళ ఉదయం మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోదీతోపాటు అమిత్‌ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

Also Read:మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత..

- Advertisement -