ఆసియా లోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి లో శతాబ్ది ఉత్సవాలలో భాగంగ, క్రిస్మస్ వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం ఏసుక్రీస్తు జన్మదినాన్నీ పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు.
ఉదయం తెల్లవారు జామున 4.30 గంటలకు ప్రాతఃకల ఆరాధనాతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభం అయ్యింది. ఈ వందేళ్ళ వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు..
ఇంచార్జీ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు.సుమారుగా 5 వేల మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు..క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్దతిలో పశువుల పాక ఏర్పాటుచేసి దానికి స్టార్ వేలాడదీశారు.
మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేసి దానిని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్‌రంగురంగుల బాల్స్‌తో అందంగా అలంకరించారు.చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్‌లు, స్టార్‌లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలిరానున్నారు..
ఈ మేరకు సి ఎస్ ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 409 మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read:విజువల్ వండర్.. బరోజ్ 3డీ