- Advertisement -
అసెంబ్లీ 15 రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు కేటీఆర్. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదు అన్నారు. రెవిన్యూ మిగులు రాష్ట్రం అని అసెంబ్లీలో భట్టి చెప్పారు, ఇప్పుడు అప్పులు కడుతున్నామని భట్టి అంటున్నారు అన్నారు.
అమరావతి ఎందుకు అభివృద్ధి చెందకూడదు…హైదరాబాద్ కు అమరావతికి సంబంధం లేదన్నారు. తెలంగాణలో అనేక పట్టణాలు అభివృద్ధి చెందాయి…రేవంత్ రెడ్డి సర్కార్ నడపడం లేదు సర్కస్ నడుపుతున్నారు అన్నారు.
మ్యానిఫెస్టోలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి…ఇప్పుడే జిల్లాలు తగ్గిస్తామని అంటున్నారన్నారు. రెవిన్యూ మంత్రి అసెంబ్లీలో జిల్లాలు తగ్గించే ఆలోచన లేదని అన్నారు.
Also Read:KTR: ఎన్టీఆర్ పై పిల్లి కూతలా?
- Advertisement -