31 మందితో జేపీసీ..ప్రియాంకకు చోటు!

0
- Advertisement -

జమిలీ ఎన్నికలపై కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.తృణమూల్ కాంగ్రెస్ నుండి నుండి కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, ఎన్‌సీపీ నుండి సుప్రియా సూలే (శరద్ పవార్), శివసేన( షిండే) శ్రీకాంత్ షిండే, ఆర్‌ఎల్‌డీ నుండి చందన్ చౌహాన్, జనసేన నుండి బాలశౌరి వల్లభనేనికి చోటు దక్కగా రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉండనున్నారు.

బీజేపీ ఎంపీ చౌదరి జేపీసీ చైర్మన్‌గా ఉండనుండగా బీజేపీ సభ్యులు బన్సూరి స్వరాజ్, సీఎం రమేశ్, పర్షోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్, భర్తిహరి మహతవ్, అనిల్ బలూనీ, వీడీ శర్మ, విష్ణు దయాళ్ రామ్, కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ నుంచి నియమితులయ్యారు. అలాగే మనీష్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్ కాంగ్రెస్ సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ కు జేపీసీలో చోటు దక్కింది.

Also Read:ఏపీ కేబినేట్ భేటి…కీలక నిర్ణయాలు

- Advertisement -