America:కాల్పుల మోత..5గురు మృతి

1
- Advertisement -

కాల్పుల మోతతో అమెరికా దద్దరిల్లింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో టీచర్‌ సహా ఐదుగురు మృతిచెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడినవారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని మాడిసన్‌ పోలీస్‌ చీప్‌ షాన్‌ బార్న్స్‌ తెలిపారు.

అగ్రరాజ్యంలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు స్కూళ్లలో 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

Also Read:‘ఘాటి’…రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -