మరో ఇద్దరు మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.
ఏకకాలంలో సోనియాగాంధీ కుటుంబంలో ముగ్గురు చట్టసభల్లో ఉన్నారు…కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో మాలలను కుటుంబంలోని ముగ్గురిని చట్టసభలకు పంపిందన్నారు. మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ చట్టసభలకు పంపింది…వివేక్ కుటుంబానికి చెందిన ముగ్గురిని చట్టసభలకు పంపింది…మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి అన్యాయమే
చేస్తుందన్నారు.
మాదిగ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయిట్ మెంట్ ఇవ్వదు…మల్లు రవి, భట్టి విక్రమార్కకు ఎలా అపాయింట్ మెంట్ ఎలా దొరుకుతుంది చెప్పాలన్నారు. మాదిగ కవులు, కళాకారులను ఉద్యమకారులుగా ప్రభుత్వం ఎందుకు గుర్తించదు,రసమయి, గిద్దె రాంనర్సయ్య, ఏపూరి వంటి కళాకారులు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా? చెప్పాలన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని మాదిగలు ఉర్రూతలూగించారు..కళాకారుల గుర్తింపులో మాదిగ కళాకారులు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఎక్కా యాదగిరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, మహిళలను రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులుగా గుర్తించలేదు అని మండిపడ్డారు మందకృష్ణ.9 మంది ప్రముఖుల్లో మాదిగలు, మహిళలను ఎందుకు గుర్తించలేదు, వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు.
Also Read:Kavitha:బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి