ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే నీటి సరఫరా బంద్!

1
- Advertisement -

ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. కీలక ఆదేశాలు జారీ చేసింది.

ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.

పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని.. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి!

- Advertisement -