సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు 11,12,13 తేదీల్లో ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు . ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్… అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు.జైపూర్‌లో బంధువుల వివాహానికి హాజరవుతారు.
అనంతరం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రమంత్రులను కలవనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్ష పదవులపై నేతలతో చర్చించనున్నారు.
అలాగే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 25 మందితో కూడిన జాబితాను సీఎం సిద్ధం చేయగా దీనికి కాంగ్రెస్ అధిష్టానం అమోదముద్ర వేస్తే ప్రకటనే తరువాయి కానుంది.
Also Read:TTD: శ్రవణం విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు