విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు పేరు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి.అమ్మాజీ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం, దరిమడుగులో పేద రైతులకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి, వైసీపీ నేత ఆదిమూలపు సురేష్, అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించారని, విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి, దర్శికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1,800 మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్ తో కూడిన వర్తింపజేయాలని రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. సౌదీ నుంచి తన భర్తను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన షేక్ నగీన వేడుకున్నారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలు పరిష్కరిస్తామని, సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్