బెంగళూరులోని ఓ మహిళను ప్రాణం పోతుందేమో అనుకునేలా చిత్రవథకు గురిచేసింది ఓ సాలీడు. సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం నిద్ర లేవగానే భరించలేని తలనొప్పి వచ్చింది. తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించి, ఆ చెవిని పలుసార్లు రుద్దుకుంది.
అయితే చెవిలో కదులుతున్నదాన్ని తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దానికి తోడు అంతకంతకు విపరీతమైన చెవి నొప్పి, తలపోటుతో విలవిలలాడిపోతూ బెంగళూరులోని కొలంబియా ఆసియా ఆసుపత్రికి వచ్చింది.
ఏమైందా అని పరీక్షించిన వైద్యులకు తొలత ఏమీ అంతుపట్టలేదు. చెవిలో ఏదో సమస్య ఉందని భావించిన వైద్యలు చెవిలోకి బ్యాటరీ లైట్ తో చూడగా అక్కడ వారికి ఓ ఎనిమిది కాళ్ల సాలెపురుగు కనిపించింది. దానిని బయటకు రప్పించడానికి ఆ లైట్ ను అలాగే సాలీడుపై ఫోకస్ చేసి ఉంచారు. దీంతో ఆ సాలీడు మెల్లిగా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
https://www.youtube.com/watch?v=Ri2OrRdlxtY