జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం ఈ నెల 26 ముహూర్తం ఖరారు చేసారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు.
తాజాగా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమిని ఓడించిన జేఎంఎం – కాంగ్రెస్ కూటమి అధికారం నిలబెట్టుకుంది. మంత్రివర్గ కూర్పు పైన సోరెన్ కసరత్తు చేస్తున్నారు.జార్ఖండ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్న హేమంత్ సోరెన్ నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26న ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి జేఎంఎం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వం లో మంత్రులుగా పని చేసి ఓడిన నలుగురికి తిరిగి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని సోరెన్ నిర్ణయించారు. తాజా ఎన్నికల్లో జేఎంఎం – 34, బీజేపీ – 21, కాంగ్రెస్ – 16, ఆర్జేడీ – 04 సీపీఐ (ఎంఎల్) (ఎల్) – 02, ఏజేఎస్‌యూపీ – 01, ఎల్జేపీఆర్వీ – 01, జేకేఎల్ఎం – 01 జేడీయూ – 01 స్థానం దక్కించుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారు మారు చేస్తూ బీజేపీ కూటమిని జేఎంఎం – కాంగ్రెస్ కూటమి ఓడించి అధికారంలోకి వచ్చింది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్ 41 కాగా, జేఎంఎం – కాంగ్రెస్ కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 స్థానాల్లో పోటీ చేసిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఏకంగా 34 చోట్ల విజయం సాధించింది. అటు ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితం అయింది. 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, 21 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలైన ఎల్జేపీ రామ్‌విలాస్ పాసవాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్‌యూ చెరో స్థానంలో విజయం సాధించాయి. బర్హెట్‌లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో 13 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Also Read:మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు