మహారాష్ట్రలో కమల వికాసం

4
- Advertisement -

మహారాష్ట్రలో కమలం గాలి వీచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. మెజార్టీ మార్క్ ను దాటేసింది కమలం పార్టీ. ఇక బీజేపీ సింగిల్‌గా సెంచరీ మార్క్‌ను దాటేసింది. మొత్తం 288 స్థానాలకు గానూ 200కు పైగా స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది.

కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌, బారామతిలో అజిత్‌ పవార్‌, వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆధిక్యంలో ఉండగా, వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్‌ సిద్దిఖీ (ఎన్‌సీపీ), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్‌ పాటిల్‌, ఔరంగాబాద్‌ ఈస్ట్‌లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్‌ జలీల్‌ లీడ్‌లో ఉన్నారు.

Also Read:KTR:మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటం

- Advertisement -