Pawan:తెలంగాణ నా గుండె చప్పుడు

2
- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీరందరూ చాలా మంది తెలంగాణ నుండి వచ్చారు..మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో..జై తెలంగాణ అన్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని…ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.

మహారాష్ట్ర రైతులు, రైతు కూలీలకు చెందిన నేల. ఈ ప్రాంతంలో జొన్న, మినుము, పత్తి విరివిగా పండుతాయి… మహారాష్ర్టలో అడుగు పెట్టగానే హర హర మహాదేవ మంత్ర ఉచ్ఛరణతో మనసు పులకిస్తోంది. హిందూ ధర్మానికి పునాదులు వేసిన నేల ఇది అన్నారు.

గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చిందన్నారు.

Also Read:సోషల్ మీడియా దుర్వినయోగం కొత్త చట్టం!

- Advertisement -