గ్రేటర్‌లో ఇండ్లు కూల్చి..నల్గొండలో పాదయాత్ర?

9
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ..జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.

ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు హరీశ్‌ రావు.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదు అన్నారు.

ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని…మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా? అని ప్రశ్నించారు. పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి? అన్నారు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర అన్నారు.

హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా? చెప్పాలన్నారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాద యాత్ర మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరం అన్నారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన మా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:రేవంత్ పాదయాత్ర..బీఆర్ఎస్ నేతల అరెస్ట్

- Advertisement -