సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసిపరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. సీఎం పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని ఆలేరులో హౌస్ అరెస్టు చేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. వలిగొండ, సంగెంలో వందలాది మంది పోలీసులను మోహరించారు. కాగా, పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్ ఖండించింది. నాయకులు, కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
సీఎం పర్యటిస్తున్న మూసీ ప్రాంతంలోని రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
Also Read:మైటా దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ నేతలు