14న “డెస్పికబుల్ మీ 3”

151
'Despicable Me 3' world wide on June 14
'Despicable Me 3' world wide on June 14
- Advertisement -

వయోబేధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ ఆదరించేవి యానిమేషన్ సినిమాలు మాత్రమే. కుటుంబసభ్యులందరూ కలిసి చూడదగ్గ ఈ యానిమేషన్ సినిమాలు రూపొందించడంలో సిద్ధహస్తులు “ఇల్యూమినేషన్” సంస్థ. ఈ సంస్థ నుండి తాజాగా వస్తున్న సినిమా “డెస్పికబుల్ మీ 3”. 2013లో వచ్చిన “డెస్పికబుల్ మీ 2” కి సీక్వెల్ గా రూపొందిన తాజా చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇల్యూమినేషన్ ఎంటర్ టైన్మెంట్ మరియు యూనివర్సెల్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ 3డి కంప్యూటర్ యానిమేషన్ సినిమాకి పియర్రీ కోఫ్ఫిన్-కైలీ బాల్డా దర్శకులు.

ఇదివరకు విడుదలైన రెండు భాగాలను ప్రేక్షకులు ఆదరించడం.. మూడో భాగం ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుండడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని “డెస్పికబుల్ మీ 3” చిత్రాన్ని విడుదలకు ముందే వరల్డ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేసేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

ఓ వజ్రాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో ముఖ్యపాత్రధారి “గ్రూ” తన తమ్ముడు “డ్రూ”తో కలిసి ఎదుర్కొన్న సమస్యలేమిటి, చివరికి సదరు వజ్రాన్ని కాపాడగలిగారా లేదా అనేది “డెస్పికబుల్ మీ 3” సినిమా కథాంశం. ఆరోగ్యకరమైన హాస్యానికి అత్యాధునిక యానిమేషన్ గ్రాఫిక్స్ తొడవ్వడంతో.. “డెస్పికబుల్ మీ 3” చిత్రం మునుపటి రెండు భాగాల కంటే విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాతలు క్రిస్ మెలెడండ్రి-జానేట్ హైలీ తెలిపారు.

- Advertisement -