తన గ్లామర్ ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించుకుంటోంది చెన్నయ్ చందమామ త్రిష. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.అందుకే ఈ భామ ప్రతి ఏడాదీ పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది అయితే ఇప్పటికే ఐదు సినిమాలు ఒప్పేసుకుంది. ఈ ఐదూ కూడా సెట్స్ మీద వున్నాయి. ఈ కోవలో తాజాగా తన ఆరవ చిత్రాన్ని రేపు ప్రారంభిస్తోంది.
త్రిష గత ఏడాది.. ఈ ఏడాది కమిటైన ఐదు సినిమాల్ని దాదాపుగా పూర్తి చేసేసింది. అరవింద్ స్వామికి జోడీగా ‘శతురంగ వేట్టై 2’లో నటిస్తున్న త్రిష.. ‘మోహిని’ అనే హార్రర్ థ్రిల్లర్లో లీడ్ రోల్ చేస్తోంది. దీంతో పాటు ‘హేయ్ జూడ్’ ‘1818’‘గర్జనై’ సినిమాల్లోనూ త్రిష కథానాయికగా కనిపించనుంది. త్రిషకు ఈ మధ్య కాలంలో అంత మంచి విజయాలేమీ లేకపోయినప్పటికీ అవకాశాలకైతే కొదవలేదు. గత ఏడాది ఆమె చేసిన ద్విభాషా చిత్రం ‘నాయకి’ అట్టర్ ఫ్లాప్ అయింది. దాని కంటే ముందు తెలుగులో త్రిష నటించిన ‘లయన్’ కూడా ఫ్లాపే. అజిత్ సరసన నటించిన ‘ఎన్నై అరిందాల్’ మాత్రమే గత కొన్నేళ్లలో త్రిషకు హిట్టు. 30 ప్లస్ లో ఉంటూ సరైన విజయాలు లేకున్నా ఇన్నేసి అవకాశాలు దక్కించుకోవడం అరుదైన విషయమే.
అయితే త్రిష కొత్త చిత్రం పేరు 96. ఈ సినిమాలో హీరోగా విలన్ పాత్రలు ఫ్రెండు పాత్రల నుంచి హీరోగా మారి.. స్టార్ స్టేటస్ సంపాదించిన విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదొక వైవిధ్యమైన థ్రిల్లర్ అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచి తమిళనాడులోని కుంభకోణంలో జరుగుతుంది. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రం త్రిష నటించే 59వ సినిమా. తమిళంలో అటు పెద్ద హీరోలతోనూ.. ఇటు చిన్న హీరోలతోనూ చేసేస్తూ బిజీగా వుండడం వల్ల అమ్మడు తెలుగు సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతోందట.