మాస్‌ లుక్‌లో యూత్‌స్టార్‌..

256
Nithin New Look in Lie Movie
- Advertisement -

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి).ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరూ షూట్‌ చెయ్యని రేర్‌ లొకేషన్స్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఎంతో భారీ ఎత్తున చిత్రీకరించారు..

Nithin New Look in Lie Movie

నితిన్ ‘అ ఆ’ తరవాత కొంచం గ్యాప్‌ వచ్చినా లై సినిమాను భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నితిన్ తనలో చాల మార్పులు చేసుకున్నాడు. నటించే పద్దతి కనిపించే పద్దతి అని కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. సినిమా కూడా మంచి సాంకేతిక విలువలు ఉన్న సినిమాగా నిర్మాణం సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి నితిన్ కెరియర్ లో ఇది ఒక మైలురాయి గా మిగిలుతుంది అని అంటున్నారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్ తో సంచలనం అయ్యాడు.

అయితే ఈ సినిమాలో నితిన్ గెటప్ పూర్తిగా మార్చేశాడు. అసలే మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇంతకు ముందు తన సినిమా గుండెజారి గల్లంతయ్యిందే లోకూడా తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ పాటను రీమేక్ చేశాడు. అప్పుడే అర్ధమైంది నితిన్ కు పవన్ అంటే ఎంత అభిమానం ఉందోని. మళ్ళీ మనోడు పవన్ ‘తమ్ముడు’ సినిమాలో వేసిన మాస గెటప్ విత్ లుంగీ వేశాడు. దీనితో మనోడు మళ్ళీ పవన్ కల్యాణ్ అభిమానులు దృష్టిలో పడ్డాడు. ఈ పోస్టర్‌తో మాస్ ప్రేక్షకులు అలరిచడానికి రెఢీ అవుతున్నాడు.

- Advertisement -