జీఎస్టీ: తీపి కబురు…

211
GST Council revises rates for 66 items
- Advertisement -

దేశవాసులకు కాస్త ఉపశమనం. జులై 1 నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోని 66 రకాల వస్తువులపై భారీగా విధించిన పన్నుల శాతం కొంత మేర తగ్గింది.  దాంతో వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి 16వ సమావేశం తర్వాత కేంద్రం తీపికబురు అందించినట్టైంది. మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది.

GST Council revises rates for 66 items

ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. కీలక పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన  విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించినట్లు జైట్లీ తెలియజేశారు. మొత్తం 133 వస్తువులపై పన్నుశాతాల్ని తగ్గించాలని విజ్ఞప్తులు అందితే, తాము 66 వస్తువులకు సవరించామని
పేర్కొన్నారు. సమానత్వం, వినిమయంలో మార్పుల కోసమే వీటిని సవరించామని తెలిపారు. జీఎస్టీపై జూన్‌ 18న మరో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో ఆయా వస్తువులపై పన్ను శాతం ఇలా ఉంది..
 GST Council revises rates for 66 items
జీడిపప్పుపై 12 నుంచి 5 శాతానికి, ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12 శాతానికి, అగరవత్తులపై 12 నుంచి  5 శాతానికి, దంతాలపై ఎనామిల్ 28 నుంచి 8 శాతానికి, ఇన్సులిన్‌పై 12 నుంచి 5 శాతానికి, ప్లాస్టిక్‌ బెడ్స్‌పై 28 నుంచి 18 శాతానికి, స్కూల్‌ బ్యాగ్స్‌పై 28 నుంచి 18 శాతానికి,  ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌ పై18 నుంచి 12 శాతానికి, పిల్లల డ్రాయింగ్ బుక్స్‌‌పై 12 శాతం ఉన్న పన్నును 0 కు తగ్గించారు.

ట్రాక్టర్ విడిభాగాలపై 28 నుంచి 18 శాతానికి, స్పూన్లు, ఫోర్క్‌లపై  18 నుంచి 12 శాతానికి, కంప్యూటర్ ప్రింటర్లపై 28 నుంచి 18 శాతానికి, ప్రీ కాస్ట్ కాన్స్‌ట్రేట్ పైపులపై 28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గించినట్లు వెల్లడించారు. సినిమాలపై 28శాతం పన్ను విధించడంతో తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. రూ.100 కంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18  శాతానికి తగ్గించారు. రూ.100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది.

GST Council revises rates for 66 items

అలాగే ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మించే రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ప్రస్తుతం వాటికి కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఒక వేళరాష్ట్రాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాలే స్థానిక చిత్రాలకు జీఎస్టీని రిఫండ్‌ చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.

చేనేత పరిశ్రమ, వజ్రాల ప్రాసెసింగ్‌ లాంటి వారు చెల్లించాల్సిన మొత్తాన్ని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఈ రంగాల్లోని ఆయా  పరిశ్రమలపై కూడా పన్ను తగ్గించడమే దీనికి కారణం.

- Advertisement -