త్వరలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా?, అలాగే వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది బీజేపీ.
జనవరి నాటికి కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకత్వ మార్పు, పార్టీ నిర్మాణం పట్ల దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రస్తుత అధ్యక్షుల పదవీకాలం పూర్తవుతున్న పలు రాష్ట్రాల్లో కూడా కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు బీజేపీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని అంతర్గత వర్గాల సమాచారం.
ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు మరియు కొంతమంది రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలాన్ని రాబోయే ఎన్నికలు పూర్తయ్యే వరకు పొడిగించాలని బిజెపి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం కొత్త వారిని అధ్యక్షులుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బీజేపీ అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ రాగా పలు రాష్ట్రాలకు కొత్త చీఫ్‌లు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఎవరు నియమితులవుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
Also Read;Dharani Protal:ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి