రాజాసాబ్..కొత్త లుక్‌లో ప్రభాస్!

2
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరో లుక్‌ని రిలీజ్ చేశారు.

ప్రభాస్ లుక్ అదిరింది అనిపించేలా ఉండగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఇండియన్ టాప్ మూవీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

రాజాసాబ్ సినిమా 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేశానని, తన మొదటి సినిమా ఈరోజుల్లోని కేవలం రూ.30 లక్షల బడ్జెట్‌తో తీశా కానీ రాజాసాబ్ మూవీకి నాలుగు రోజుల్లో రూ.4 కోట్లు ఖర్చు అయిందని దర్శకుడు మారుతి చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:బాసరలో ఎరువుల కొరత

- Advertisement -