త్వరలో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది.అయితే స్పాట్ బుకింగ్ టికెట్లు కాకుండా మొత్తం ఆన్‌లైన్‌లోనే టికెట్లు ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకోవడంతో.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో వెనక్కి తగ్గిన దేవస్థానం బోర్డు.. ఆన్‌లైన్ టికెట్లతోపాటు నడకదారిన వచ్చే భక్తులకు కూడా స్పాట్ బుకింగ్ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇక రోజూ 80 వేల మందికి శబరిమల అయ్యప్ప దర్శనాలు కల్పించేందుకు.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇందులో నుంచే ఆన్‌లైన్, స్పాట్ బుకింగ్ టికెట్లను కేటాయించారు. అయితే అందులో రోజుకు 70 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో, 10 వేల టికెట్లను స్పాట్ బుకింగ్ కింద జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read:Harishrao:నిరుద్యోగ యువతపై అరాచకం