మోనోపాజ్ సమస్యా..ఈ చిట్కాలు పాటించండి!

5
- Advertisement -

నేటి రోజుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరు మహిళలు సంతాన సామర్థ్య లేమితో సతమతమౌతున్నాట్లు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా పురుషుల కంటే మహిళలే సంతానం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు.

అయితే మహిళల్లో మెనోపాజ్ అనేది ఒక దశ. గతంలో 50 నుంచి 55 ఏళ్లు దాటిన వారిలోనే మెనోపాజ్ కనిపిచేంది. కానీ.. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో 40 ఏళ్లలోనే వస్తోంది. ఈ దశలో రుతుక్రమం ఆగిపోతుంది. ఒంట్లో వేడి ఆవిర్లు, అరికాళ్లలో మంటలు రావడం. ఈ సమస్యలు కొందరి మామూలుగా ఉంటే.. మరికొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి.

దీనికి కారణం విటమిన్ లోపానికి తోడు ఇతర అనారోగ్యాలు, దీర్ఘకాలిక రోగాలు. ఇవి ఉన్నవారిలో ఈ వేడి ఆవిర్లు, చెమట సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే డాక్టర్ల సూచనల మేరకు క్యాల్షియం, విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!

ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. పండ్లలో బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్​లో ఆకుకూరలు, బ్రోకలీ వంటివి తీసుకోవాలి. అవిసె గింజలు, నట్స్, చియా సీడ్స్, చేపలు వంటి వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. క్రమం తప్పకుండా మీ డైట్​లో ఇవి ఉండేలా చూసుకోవాలి.

చికెన్, మేక మాంసం, గుడ్లు, బీన్స్, లెంటిల్స్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆహారంలో భాగం చేసుకోవాలి.కాల్షియం: పాలు, పాల ఉత్పత్తులు తప్పకుండా తీసుకోవాలి. బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. వీటిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -