నేనే రాధ…నేనే భార్య

225
Kajal FirstLook on Nene Raju Nene Mantri
- Advertisement -

జయం, నువ్వునేను వంటి చిత్రాలతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ తేజ. చాలా గ్యాప్ తర్వాత బాహుబలి స్టార్ రానాతో నేనే రాజు నేనే మంత్రి అనే ఓ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీని తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్  జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన రాగా తాజాగా కాజల్‌ ఫస్ట్ లుక్‌ని  ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

Nene Raju Nene Mantri

నేనే రాధ నేనే భార్య అంటూ చక్కనైన చీరకట్టులో ఉన్న కాజల్‌ చూడముచ్చటగా ఉన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర పాత్రధారుల పోస్టర్లను కూడా ఈరోజు విడుదల చేయనున్నట్లు రానా తన ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Nene Raju Nene Mantri

ఈ సినిమాలో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నాడు. రానాకి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. డి.సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -