తెలంగాణ భవన్ @ జనతా గ్యారేజ్

8
- Advertisement -

హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జనతా గ్యారేజ్‌లా మారింది. తమ బాధ చెప్పుకునేందుకు హైడ్రా బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని బాధితులు చెబుతున్నారు. ఎప్పుడు కులుస్తారో అని నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం అంటున్నాయి హైడ్రా బాధిత కుటుంబాలు.

నిరంకుశ ప్రభుత్వ విధానాలతో రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. బీఆర్ఎస్ పెద్దలను కలిసి మా గోడు వెళ్లబోసుకుంటాం అంటున్నామని చెబుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దండం పెట్టి చెప్తున్నాం…మీకు దండం పెడుతున్నాం మాకు సపోర్ట్ చేయండి.. జర్నలిజం చచ్చిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.

అక్రమ కట్టడాలు అని పదే పదే ఎందుకు చెప్తున్నారు…మీకు రేటింగ్స్ కోసం తప్పుడు ప్రచారం చేయకండని ఓ బాధితులు తన గోడు వెళ్లబోసుకున్నాడు. నిజం నిర్భయంగా చెప్పండి అన్నారు. ఇక కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్ కి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉండగా ముగ్గురు బిడ్డలకు పెళ్ళీలకు కట్నంగా ముగ్గురికి ఇండ్లు కట్నంగా ఇచ్చారు శివయ్య. కూల్చివేతలలో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాయని హెచ్చరించారు హైడ్రా అధికారులు. బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయనే మనస్తాపంతో ఉరేసుకొని చనిపోయింది తల్లి బుచ్చమ్మ.

Also Read:ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి

- Advertisement -