TTD: కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

8
- Advertisement -

తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 29న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 4న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 5న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 6న శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు, అక్టోబరు 7న మావడి సేవ, అక్టోబరు 8న శ్రీ‌అన్నపూర్ణాదేవి, అక్టోబరు 9న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 10న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 11న శ్రీ‌ సరస్వతి దేవి, అక్టోబరు 12న శ్రీ శివ‌పార్వ‌తుల‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 12న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంట‌ల‌కు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Also Read:విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

- Advertisement -