అమ్మాయిలు అర్థం కారంటున్న నాని..

198
- Advertisement -

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ కనిపించే ఈ టీజర్‌లో నాని వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ. అన్ని అలవాట్లు వున్నవాళ్ళని ప్రేమిస్తారు.. ఏ అలవాట్లూ లేనివాడ్ని పెళ్ళి చేసుకుంటారు’ అనే డైలాగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ‘నిన్నుకోరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Nani Ninnu Kori Teaser

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.

- Advertisement -