బాలకృష్ణ-పూరి పక్కా ‘పైసా వసూల్‌’

250
Balakrishna – Puri 101 is a Pakka Paisa Vasool
- Advertisement -

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి బాలయ్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తాజా చిత్రానికి ‘పైసా వసూల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. బాలకృష్ణ స్టైల్‌గా నిలబడిన పోస్టర్‌పై ‘హ్యాపీబర్త్‌డే ఎన్‌బీకే’ అంటూ క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్‌’, ‘తేడా సింగ్‌’, ‘జై బాలయ్య’ ‘పైసా వసూల్‌’ తదితర పేర్లను పరిశీలించిన చివరకు చిత్ర బృందం ‘పైసా వసూల్‌’ వైపే మొగ్గు చూపింది

భవ్య క్రియేషన్‌ బేనర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోలకు మాస్‌ ఇమేజ్‌ తెచ్చే దర్శకుడిగా పేరున్న పూరి తమ అభిమాన కథానాయకుడిని ఎలా చూపిస్తారో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బాలకృష్ణ ఇందులో డాన్‌ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

పూరి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. అటు బాలకృష్ణ నుంచి, ఇటు పూరి జగన్నాథ్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని మాస్‌ అంశాలు ఇందులో ఉండబోతున్నాయట. ఇటీవలె డూప్‌ లేకుండా బాలకృష్ణ చేసిన స్టంట్‌ యూనిట్‌ సభ్యులను ఆశ్చర్యపరిచింది. ఓ ఫైట్‌ కోసం 360 డిగ్రీల్లో డ్రిఫ్టింగ్‌ పద్ధతిలో కారుని నడిపే సన్నివేశాన్ని ఎలాంటి డూప్‌ లేకుండా చేసేశారు బాలకృష్ణ. పోర్చుగల్‌లో కీలకమైన ఛేజింగ్‌ సన్నివేశాలతో పాటు, కొన్ని పాటల్ని, టాకీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Balakrishna – Puri 101 is a Pakka Paisa Vasool

- Advertisement -