తెలుగు రాష్ట్రాల్లో దేవర టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇప్పటికే ఏపీలో టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతివ్వగా తాజాగా తెలంగాణ సర్కార్ సైతం ఓకే చెప్పేసింది.
దేవర సినిమా రిలీజ్ రోజు 29 థియేటర్లకు అర్థరాత్రి 1 గంటలకు, మిగతా థియేటర్లకు అర్థరాత్రి 4 గంటలకు షో విడుదలకు అనుమతిచ్చింది. దేవర సినిమా రిలీజ్ రోజు టికెట్ రేట్ కంటే రూ.100/- అదనంగా పెంచుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.50/-,సింగిల్ స్క్రీన్లలో రూ.25/- అదనంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
Also Read:ప్రకాశ్ రాజ్, కార్తీపై పవన్ సీరియస్