కాళేశ్వరం వృధా కాదని ఒప్పుకున్న కాంగ్రెస్!

0
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందన్నారు. నన్ను విమర్శించే పనిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నాడు..
ఎల్లంపల్లి ప్రజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. పేరుకే బ్యారేజి పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదు. ప్రాజెక్టు కు సంబంధించిన అనేక అంశాలను గాలికి వదిలేశారు అన్నారు.

ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాల తరలింపు జరగలేదు. కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించలేదు. 144 మీటర్లకు నీరు చేరితే పాత లోలెవెల్ బ్రిడ్జ్ మునిగి పోయేది. రాకపోకలు బంద్ అయ్యేవి. మీ హయాంలో ఎల్లంపల్లి బ్యారేజి పూర్తి అయినా పై కారణాల వలన పూర్తి స్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయింది. తెలంగాణ వచ్చాకనే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కాలనీలకు తరలించి, రాజీవ్ రహదారిపై వేగంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్ ఆర్ ఎల్ 148 మీటర్ల వరకు 20 టిఎంసిల నీటిని నింపినం. అది మా ప్రభుత్వం సాధించిన ఘనత.
“తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని” అన్నట్టు మీరు అన్ని ప్రాజెక్టులను అప్పగించినట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా మాకు అప్పగించితే దాన్ని రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చినాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, హై లెవల్ బ్రిడ్జీ, రహదార్ల నిర్మాణం కోసం 2,052 కోట్ల రూపాయలు వెచ్చించింది. బరాజ్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’ గా మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభం అయ్యింది. ఇదంతా జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అన్నవాస్తవాన్ని పొన్నం ప్రభాకర్ గారు గుర్తించకపోయినా కరీంనగర్ రైతాంగానికి తెలుసు అన్నారు హరృవ్ రావు.

“బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ లో భాగమైన ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్ మానెరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి” అని పొన్నం గారు నిజాయితీగా ఒప్పుకున్నందుకు సంతోషం. ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అలైన్మెంట్ మార్చలేదని మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. CWC సలహాల మేరకు ఈ ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచినాము. మీరు ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యం కేవలం 14 టిఎంసిలే. రీ ఇంజనీరింగ్ తర్వాత 141 టిఎంసిలకు పెరిగింది. ఆ పెరిగిన జలాశయాల్లోకి ఈ రోజు నీటిని నింపగలిగినారు. అవి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినా కూడా మీరు వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన సదుపాయాలనే కదా. ఎల్లంపల్లి అప్పుడు ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా ఉండేది. రీ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో భాగం అయ్యింది. అవి కాళేశ్వరంలో భాగం అయిన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లే అయినా కాళేశ్వరం వ్యవస్థ ద్వారా చేరిన గోదావరి నీళ్లే కదా అన్నారు.

Also Read:మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు

- Advertisement -