అదానీతో గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ:కేటీఆర్

4
- Advertisement -

అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుబట్టారు కేటీఆర్. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ సంస్థలు మోదీ జేబు సంస్థలంటూ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు అని మండిపడ్డారు. ఇవ్వాళ అదే రేవంత్ రెడ్డి సహా మంత్రులు అదానీ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు… దీంతో కాంగ్రెస్ నేతలు ఏమైనా స్ల్పిట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడుతున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రెడ్ కార్పెట్ వేసి మరీ అదానీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి నేడు నిరసన తెలపనుండటం ఈ ఏడాదిలోనే అతి పెద్ద జోక్ అని కేటీఆర్ అన్నారు.  గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ. ఇదీ కాంగ్రెస్‌ నీతి. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా అంటూ కేటీఆర్ నిలదీశారు.

Also Read:

- Advertisement -