8 నెలల కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే, కనకపు సింహాసనాల మీద కూర్చున్నవేమో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతి పక్షాన్ని కరుసున్నాయి అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కిరణ్ రెడ్డిదే బలహీన ప్రభుత్వం అనుకున్నాం కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంతకు మించిన బాధ్యతరాహిత్య పాలన ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..హరీశ్‌రావు ఏమన్నడని మంత్రి బాధపడాలి.. కుమిలిపోవాలి. సీతారామ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. బటన్ నొక్కే అదృష్టం మీకొచ్చింది. మీరు అదృష్టవంతులు అని హరీశ్‌రావు చెప్పారు అన్నారు.
బటన్ నొక్కేటప్పుడు ఇది కేసీఆర్ కష్టం అని చెప్పాలని ఒక మాట సూచించారు… దానికి ఉలిక్కిపడి అన్ని అనుమతులు మేమే తెచ్చాం అని కాంగ్రెస్ మంత్రులు అనడం సరిగా లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు హామీలు ఇచ్చుడు, ఒట్లు పెట్టుడు ఒడిసిపోయాయి. ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు భుజాలు తడుముకుని సమాధానాలు చెప్పలేక ఏడ్చే పరిస్థితి వచ్చింది… చివరి రోజుల్లో వస్తది అనుకున్నాం కానీ ప్రారంభంలోనే ఈ పరిస్థితి తలెత్తింది అన్నారు.
Also Read:ఢిల్లీలో హై అలర్ట్..ఆత్మాహుతి దాడికి కుట్ర.. !