బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. బాహుబలి లాంటి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా రాజమౌళికే మాత్రమే కాదు.. సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా దక్కుతుంది.. ఐదేళ్ల క్రితం బాహుబలి అనే ఓ పెద్ద సినిమాను తీస్తున్నప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సినిమా పూర్తయ్యేంతవరకు ఎంత బడ్జెట్ పెట్టాలో తెలియదు.. ఒకవేళ పెట్టినా.. ఎంత ప్రాఫిట్ మిగులుతుందో అనుమానమే.. అయినా సరే బాహుబలిని నిర్మించారు.. ఎవరూ ఊహించని విధంగా విజయాన్ని సాధించారు.. తాము పెట్టిన డబ్బుకు మూడింతలు కలెక్షన్లు వచ్చాయి. ఆల్ హప్పీస్.. అనుకున్నారు.. ఇప్పుడు బాహుబలిని మించిన రిస్క్‌ను తీసుకునేందుకు సిద్దమౌతున్నారు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.
బాహుబలి ఇచ్చిన కిక్‌తో మరో ఫాంటసీ సినిమా నిర్మాణానికి సిద్ధమవుతున్నారు బాహుబలి నిర్మాతలు. అయితే ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకొన్న దర్శకుడితో ప్రయోగం చేయడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే కే ప్రకాశ్ సన్ ఆఫ్ రాఘవేంద్రరావు.. ఈ దర్శకుడు తీసినవి రెండే సినిమాలు.. అవి అనగనగా ఓ ధీరుడు.. సైజ్ జీరో.. రెండు కూడా అట్టర్ ఫ్లాఫ్‌లే..
ఇక వరుస విజయాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న శర్వానంద్‌ను ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. శర్వానంద్ సినిమా మార్కెట్ ప్రస్తుతం 20 కోట్లు. . అతని సినిమా బిజినెస్ స్థాయికి రెట్టింపు బడ్జెట్‌తో తాజా చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు సన్నద్ధమవుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది. కేవలం 20 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న శర్వా హీరోగా, ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేని ప్రకాష్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసి మరోసారి తమ గట్స్ చూపించారు.
అయితే రాఘవేంద్రరావు శోభు మరియు ప్రసాద్‌లకు చాలాకాలం నుంచి సాయం చేశాడు. వారు టీవీలో కష్టాల నుండి బాహుబలి వరకు రాగలిగారంటే రాఘవేంద్రరావు కారణం. ఆయన మీద నమ్మకంతోనే.. బాహుబలి లాంటి సినిమాను తమ చేతుల్లో పెట్టి.. తమకు గొప్ప విజయాన్ని అందించినందుకు గ్రాటిట్యూడ్‌గా ప్రకాశ్‌తో సినిమా చేయడానికి సిద్దమైనట్టు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఏది ఏమైనా మూడో సినిమాతోనైనా ప్రకాశ్ మంచి హిట్ కోట్టాలని కోరుకుందాం..