సుప్రీంకోర్టు న్యాయవాదులపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ముంబై చెంబుర్ కాలేజీలో విద్యార్ధినిలు బురఖా, హిజాబ్ రద్దు చేసిన వ్యవహారంపై విచారణతో పాటు ఏక్ నాథ్ షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి మహారాష్ట్ర స్పీకర్ నిరాకరించినందుకు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని న్యాయవాది కోరారు. ఈరోజు ఈ అంశం జాబితా చేయబడినప్పటికీ ధర్మాసనం పాక్షికంగా విని మరో అంశాన్ని విచారిస్తున్నందున అది తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సీజేఐ పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
కోర్టులు, న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో కనీసం అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇదే క్రమంలో న్యాయవాదులు ఒక రోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే ఎంత ఒత్తిడితో పని చేస్తున్నామో అర్ధయవుతుందన్నారు. ఒక్కసారి కూర్చుంటే మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారుని వెల్లడించారు.
ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు కానీ, న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిఒక్క పిటిషన్‌పై విచారణ చేస్తాము.. దానికి ఒక తేదీ ఇస్తాము కానీ న్యాయమూర్తులను, కోర్టును శాసించవద్దు అంటూ చంద్రచూడ్ సూచించారు.
Also Read:రంగనాయక సాగర్‌కు గోదావరి జలాలు..ఆనందంలో రైతులు