చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…

212
All set for Bathini Brothers Fish prasadam
- Advertisement -

ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో  చేప ప్రసాదం ఇస్తామన్నారు బత్తిన హరినాథ్ గౌడ్. ఆ రోజు రాలేకపోయినవారికి మరో రెండు రోజుల పాటు ఇంటిదగ్గర చేప ప్రసాదాన్ని ఇస్తామన్నారు. ఇప్పటికే చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ నుంచి కావాల్సినన్ని చేప పిల్లలను తీసుకున్నామన్నారు. కిందటేడాది 4 లక్షల మంది చేప ప్రసాదం కోసం వచ్చారని..ఈయేడు ఇంకా ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందన్నారు.

చేప ప్రసాదం ఇచ్చే దగ్గర ప్రత్యేకించి 32 కౌంటర్ల ఏర్పాటు చేస్తుండగా… ఒక్కో కౌంటర్ వద్ద పోలీసు, రెవిన్యూ ఆఫీసర్లు ఉండేలా ఆలోచన  చేస్తున్నారు. చేప ప్రసాదానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ మైదానాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. డాగ్‌, బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది అణువణువు తనిఖీ చేస్తున్నారు. డీసీపీ, అడిషనల్‌ డీసీపీ, ఎనిమిది మంది అదనపు ఏసీపీలు, 22 మంది సీఐలు, 57 మంది ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

All set for Bathini Brothers Fish prasadam
మైదానంలో తాత్కాలిక పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 22 రోప్‌ పార్టీలు, నిరంకారి స్వచ్ఛందసంస్థకు చెందిన 600 మంది వలంటీర్లు బందోబస్తులో సహకరిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. అజంతా గేట్‌ నుంచి లోనికి వచ్చిన వారు చేపప్రసాదం స్వీకరించిన తరువాత మాలకుంట ద్వారం గుండా బయటకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్‌లు కలిగిన వారికి మైదానంలోని గాంధీ సెంటినరీ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం అందించనున్నారు.

చేప ప్రసాదం కోసం ఇప్పటికే వేరే రాష్ట్రాల నుంచి జనం వచ్చారు. ఏటా ఇంతదూరం వచ్చి తప్పకుండ చేప ప్రసాదం తీసుకుంటున్నామని చెబుతున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది.  ఇప్పటికే గ్రౌండ్ కు చేరుకున్నవారికి స్వచ్ఛంధ సంస్థలు టిఫిన్లు, బోజనాలు సమకూర్చాయి.

All set for Bathini Brothers Fish prasadam

- Advertisement -