జగన్ మళ్లీ జైలుకే..బీజేపీ మంత్రి సంచలన కామెంట్స్!

35
- Advertisement -

జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి సత్యకుమార్. అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన సత్యకుమార్.. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని అన్నారు.

సంపాదనే లక్ష్యంగా జగన్‌ ఐదేళ్లు పాలన సాగించారని విమర్శించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా హత్యలు, దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతూ ఢిల్లీలో ధర్నాలు చేయడం పెద్ద నాటకమని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకే ఢిల్లీలో డ్రామా ఆడారని విమర్శించారు. వైసీపీ శ్రేణులపై జరిగిన దాడుల వివరాలు ఇవ్వమంటే ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.

ఆర్థిక భారం ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని చెప్పారు. పట్టువస్త్రాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ధర్మవరం చేనేత పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. చేనేత రాయితీలను తొలగించిందని అన్నారు. చేనేత రంగం మళ్లీ కళకళలాడటానికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Also Read:TTD:ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

- Advertisement -