పారిస్ ఒలింపిక్స్‌కు చిరంజీవి దంపతులు

31
- Advertisement -

విశ్వక్రీడలు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆరంభ వేడుకల్లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంతో కలిసి ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య సురేఖతో కలిసి ఒలింపిక్‌ టార్చ్‌ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా షేర్ చేశారు. ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ప్రస్తుతం చిరు ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Also read:ఇందిరా పార్కు వద్ద నేతన్నల ధర్నా

- Advertisement -