ఫ్యాన్స్‌కి బాలయ్య బహుమతి..

187
- Advertisement -

పూరీ జగన్నాథ్ బాలయ్యతో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. పూరి,నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. వాళ్లిద్దరి దారులు భిన్నంగా ఉంటాయి. ఈ కాంబినేషన్లో సినిమా అని ముందుగా వార్తలొచ్చినపుడు చాలా మంది నమ్మలేదు.కానీ అదే నిజమైంది.ఈ సినిమా షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నారు. కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది.

Puri Balakrishna Movie First Look Release Date

నందమూరి బాలకృష్ణ 101 సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసందే.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ‘జూన్ 9న నందమూరి బాలకృష్ణ.. పుట్టిన రోజు సందర్బంగా ఫేస్ బుక్ పేజ్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు’ అంటూ నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అదే రోజున ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ కూడా చేయనున్నారు బాలయ్య. ఇటు ఫస్ట్ లుక్ తో పాటు.. లైవ్ చాట్ చేసి.. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు రెండు బహుమతులు ఇవ్వనున్నారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ పై కూడా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నూతన ట్రెండ్ అయిన ఫేస్ బుక్ లైవ్ చాట్ వంటివి యంగ్ హీరోలు మాత్రమే చేస్తుంటారు. బాలయ్య వంటి సీనియర్ హీరోలు అలాంటివి ఎప్పుడూ చేయలేదు. మరి అప్పుడప్పుడూ అభిమానులు కాస్త ఇబ్బందికరంగా బిహేవ్ చేసే ఈ లైవ్ చాట్ లో.. ఇప్పుడు బాలయ్య ఏం చెప్తాడో.. ఒకవేళ తిక్క ప్రశ్నలు ఎవరైనా అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ చాలామంది ఆందోళనగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.

- Advertisement -