స్టార్‌ హీరోయిన్‌ను ఫాలో అవుతున్న అనసూయ..

188
- Advertisement -

యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యనక్కర్లేని పేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది అనసూయ.మరి ఈఅమ్మడు సోషల్‌ మీడియాలో కూడా బాగానే ఫాలోఅవుతుంది.తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటోంది అనసూయ.అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడు సమంతాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.

Anasuya Repeated Samantha's Swimming Pool

సమంత కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవలే వెకేషన్‌ కోసం యూరప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తను ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది సమంత. అందులో స్విమ్మింగ్‌ఫూల్‌లో సమంత దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

అయితే తాజాగా ఈఅమ్మడు కూడా అలాంటి ఫోటోనే సోషల్‌ మీడియాలో పెట్టింది. అనసూయ ప్రస్తుతం తన భర్తతో కలిసి ఉదయ్‌పూర్‌కు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ ఓ స్విమ్మింగ్‌పూల్‌లో సేదతీరుతూ ఉన్న ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈ ఫోటోను చూసిన వారందరూ ‘రీల్‌ అనసూయ రియల్‌ అనసూయ ఒకేలాంటి ఫోటోను షేర్‌ చేశార’ని కామెంట్‌ చేస్తున్నారు.

- Advertisement -