- Advertisement -
వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన మోడీ, ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని …తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు.
ఈ బడ్జెట్ అమృత్ కాలానికి చెందిన బడ్జెట్ అని, 2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అన్నారు. 2029 జనవరిలో ఎన్నికల్లో పోరాడదాం… సభలో మాట్లాడేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన సభ్యులకు అవకాశం వస్తుందన్నారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం.
Also Read:హాయ్ జగన్…వైసీపీ అధినేతతో రఘురామరాజు
- Advertisement -