ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లిక్కర్ స్కాం ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. అలాగే లిక్కర్ కేసులో తన అరెస్ట్ అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్టు జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం తెలిపింది.
ప్రస్తుతం తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జూన్ 20న కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా… మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు రిలీఫ్ లభించింది.
Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే