సార్.. ఏపీకి ఒక్కరోజు సీఎంగా ఉండండి..!!

211
KTR 's twitter chat with AP people
KTR 's twitter chat with AP people
- Advertisement -

సాయం కావాలంటే ఆయనకు ఒక్క ట్వీటు చేస్తే చాలు.. మీ పని అయిపోయినట్టే.. ఆయన మన ఐటీ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ ఆదివారం సంధర్బంగా సరదాగా ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజకీయాల నుండి సినిమాల వరకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు కేటీఆర్.

KTR tweet

ఏపీకి చెందిన సాయికిరణ్ రెడ్డి అనే వ్యక్తి “సార్.. ఒకే ఒక్కడు సినిమాలో లా ఏపీకి వన్డే సీఎంగా ఉండొచ్చు కదా?! నో అని చెప్పొద్దు ప్లీజ్“ అని ట్వీట్ చేయగా.. కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి మొదట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడగాలని కేటీఆర్ రిట్వీటు చేశారు. డాక్టర్ ఎంవీ రామ్మోహన్ అనే వ్యక్తి “మా ఆంధ్రాని కూడా మీరే లీడ్ చేస్తే బాగుంటుంది. మీ అభిమాని నెల్లూరు నుంచి“అని ట్వీట్ చేయగా “తెలంగాణలో చాలా పని ఉంది డాక్టర్ గారు“ అని కేటీఆర్ చమత్కరించారు. డాక్టర్ సి. శ్రీనివాస్ అనే వ్యక్తి “తెలంగాణకు కేటీఆర్ కు అభిమానిగా.. మీ రాష్ట్రానికి ఎలా సాయం చేయగలను.. మీరు రానిస్తారా“ అంటే “ఎలాంటి అనుమానొలొద్దు సార్. భారతదేశం బలమైన దేశంగా నిలబడాలంటే.. రాష్ట్రాలు బాగుండాలి. బలమైన రాష్ట్రాలతోనే దేశం బలంగా నిలుస్తుంది.“ అని చెప్పారు.

“మీకు ఏపీలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడి టూర్ ప్లాన్ ఏమైనా ఉందా..?“అని ఒకరు ట్వీట్ చేయగా “త్వరలో ఎప్పుడైనా..“కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మోహన్ కృష్ణ అనే వ్యక్తి “ఐ హేట్ యు. తెలంగాణ ఆంధ్రాలలో మంచి నేతలున్నారు. కానీ మీరు వారందరిలో కాస్త డిఫరెంట్ గా ఉన్నారు. మా ఆంధ్రావాళ్లకు మీరంటే అసూయ కలుగుతోంది. ఒక ఇండయన్ గా మీరంటే ఇష్టం“ అని పేర్కొనగా “ఐ లవ్ యూ టూ“ అని కేటీఆర్ చమత్కరించారు.

 ప్రియమైన సీఎం గారు మీరు కలిసి చూసిన ఏదైనా ఇండో పాక్ మ్యాచ్ ఉందా.? ఇండియా గెలిచినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? అని మహేందర్ ప్రశ్నించగా “సీఎం గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందరిలాగే ఎంజాయ్ చేస్తుంటారు“అని కేటీఆర్ తెలిపారు. మీరే ఛాయ్ తాగుతారు.. హైదరాబాదీ ఇరానీ ఛాయ్ లేదా స్టార్ బక్స్ .. సీసీడీ అని శ్రీకాంత్ అనే వ్యక్తి సందేహానికి ఏరోజైనా ఇరానీ ఛాయేనని జవాబు ఇచ్చారు. మీ అభిమాన నటి ఎవరు? అనే ప్రశ్నకు `అందరూ` అని సమాధానమిచ్చారు. 2019లోపు మిషన్ భగీరథ పూర్తవుతుందని మీరు భావిస్తున్నారా..? ఇప్పటికే మీడియాలో నెగెటివ్ వార్తలు చాలా వస్తున్నాయి అంటూ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సందేహం వ్యక్తం చేయగా 2018లోపు పూర్తవుతుందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ పాలన.. వీటిలో ఏది కష్టమని శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రశ్నించగా పాలనే కష్టమని కేటీఆర్ వివరించారు.

- Advertisement -