మైత్రీ మూవీస్‌..ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

14
- Advertisement -

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”. AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైటర్స్ ని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయనుంది.

ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ కాగ, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. వెంకట్ రాజన్ ఎడిటర్.

Also Read:KTR:వడ్డీతో సహా చెల్లిస్తాం

- Advertisement -