ఓటమిని అంగీకరించిన రిషి..

22
- Advertisement -

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు.

ఓటమిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్‌ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారని… ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించిందన్నారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది…. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా అని సునాక్‌ తెలిపారు.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో లేబర్‌ పార్టీ 341 సీట్లకు పైగా విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

Also Read:TTD:9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- Advertisement -