Harish:జాబ్ క్యాలెండర్ ఏమైంది?

8
- Advertisement -

జాబ్ క్యాలెండర్ ఏమైందో చెప్పాలన్నారు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు…బి ఆర్ ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయమని మోతిలాల్ ని కోరడం జరిగిందన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్య ఇది అన్నారు.

మీ తల్లితండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నాము అయినా కూడా దీక్ష విరమణ చేయటం లేదు…ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి తప్పించుకుంది…ఇప్పుడు నిరుద్యోగులు గుండెలు మీద తంతున్నారు అన్నారు. రాహుల్ గాంధీ ని అశోక్ నగర్ పిలిపించి హామీ ఇప్పించారు…రాహుల్ గాంధీ మాట ఇచ్చారు రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతాము అన్నారు.

ఏపీలో 1:100 సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు…వాళ్ళేం గొంతుమ్మే కోరికలు కోరడం లేదు అన్నారు. గ్రూప్ 2,3ఉద్యోగాలు సంఖ్య పెంచాలి..జీవో 46 రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదు అన్నారు.మెగా డి ఎస్సి ఇస్తాం అని చెప్పి ఎందుకు వేయలేదు…ప్రైమరీ స్కూల్ లో టీచర్లు లేరు వాటిని వెంటనే నింపాలన్నారు.

నిరుద్యోగభృతి ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే ఎందుకు ఇస్తాలేరు…నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. కిడ్నీ లో, ఛాతిలో నొప్పి వస్తుంది అని మోతిలాల్ అంటున్నారు, మోతిలాల్ కి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది…సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చర్చలు జరపాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కాగానే నిరుద్యోగులు సమస్యలు పైన ప్రశ్నిస్తాం, అసెంబ్లీని స్థంబింప చేస్తామన్నారు.

Also Read:“కూర్మనాయకి”లో శివాజీ

- Advertisement -