Rahul:నీట్ లీకేజీపై మోడీ స్పందనేది?

5
- Advertisement -

నీట్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధానిని ఎక్స్ వేదికగా 10 సమస్యలపై నిలదీశారు రాహుల్. నీట్, యూజీసీ నెట్, రైలు ప్రమాదం, నీటి సంక్షోభంపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి పెట్టారని చెప్పారు.

ఎన్డీయే తొలి 15 రోజుల్లో జరిగినవి.. 1. ఘోర రైలు ప్రమాదం, 2. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు 3. రైళ్లలో ప్రయాణికుల దుస్థితి 4. నీట్ స్కామ్, 5. నీట్ పీజీ రద్దు 6. యూజీసీ నెట పేపర్ లీక్ 7. పాలు, పప్పులు, గ్యాస్ ధరల పెరుగుదల 8. కార్చిచ్చు, 9.నీటి సంక్షోభం, 10.అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఏర్పాట్లు చేయకపోవడంతో మరణాలు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read:ప‌వ‌న్‌తో నిర్మాత‌ల భేటీ

- Advertisement -