హజ్‌యాత్రలో 1300 మంది మృతి..

12
- Advertisement -

హజ్ యాత్రలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎండతీవ్రత కారణంగా ఇప్పటివరకు 1300 మంది మృతి చెందినట్లు సౌది ప్రభుత్వం ప్రకటించింది. అస్వస్థతకు గురైన 95 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని …చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు ఉన్నారని సౌది అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది హజ్‌ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్‌ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది.

Also Read:నేరేడుపండుతో షుగర్ సమస్యలకుచెక్!

- Advertisement -