దటీజ్ నవీన్…బీజేపీ ఎమ్మెల్యేకు ప్రశంస

12
- Advertisement -

ఒడిశాకు 24 సంవత్సరాల పాటు సీఎంగా సేవలందించిన నవీన్ పట్నాయక్‌కు గత ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. బీజేడీ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. నవీన్‌ పట్నాయక్‌ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.

గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్‌ జిల్లాలోని కంటాబంజి స్థానాల్లో బరిలోకి దిగగా కంటాబంజి లో బీజేపీ అభ్యర్థి లక్ష్యణ్‌ బాగ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక ఇవాళ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా అసెంబ్లీకి వచ్చారు నవీన్.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ పలకరించి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో నవీన్‌ పట్నాయక్‌ను చూసిన లక్ష్మణ్‌ బాగ్‌ లేచి నమస్కరించి పరిచయం చేసుకున్నారు. వెంటనే నవీన్‌ పట్నాయక్‌ …ఓహ్‌.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు అన్నారు.దీంతో అక్కడున్న నూతన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దటీజ్ నవీన్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -