తెలుగులో స్టార్ హీరోల్ని వాళ్ల నటన.. అందం.. లాంటివి చూసి అభిమానించే ఫ్యాన్స్ మాత్రమే ఉండరు. కులం పిచ్చితో అభిమానించే వాళ్లూ ఉంటారు. అభిమానులు కులాల వారీగా కూడా విడిపోయారు తెలుగు రాష్ట్రాల్లో. సినీ హీరోల్ని అభిమానించే విషయంలో దేశంలో ఇంకెక్కడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ‘కులం’ అనేది కీలక పాత్ర పోషిస్తోందంటే అతిశయోక్తి ఏమీ లేదు. కొందరు హీరోలకు సైతం ఈ కులం పిచ్చి ఉన్న సంగతీ ఒప్పుకోవాల్సిందే.
ఇక ప్రతి వ్యక్తిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. దీనికి సెలబ్రిటీలు మినహాయింపు కాదు. స్టార్ హీరో ప్రభాస్‌కు కూడా ఓ బలహీనత ఉంది. అదే బద్దకం. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి చాలా సందర్భాల్లో వెల్లడించాడు. వ్యక్తిగతంగా ప్రభాస్ చాలా బద్దకస్తుడని అంత బద్ధకాన్ని మరెవరిలో చూడలేదని అన్నారు.
అయితే ఓ విషయంలో మాత్రం ప్రభాస్‌ను తెగ పొగిడేస్తున్నారు. కులం విషయంలో మాత్రం ప్రభాస్ చాలా గొప్పోడు అంటున్నారు. అభిమానులు కూడా ఇప్పుడు కులం పేరిట సెపరేట్ అవుతున్నారని.. 90శాతం మంది అభిమానుల్లో పది శాతం మంది కుల ఫ్యాన్స్ ఉంటున్నారని, వారి వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చాడు.
అయితే ప్రభాస్‌కు మాత్రం కుల పిచ్చి లేదని రాజమౌళి స్పష్టం చేశారు. బాహుబలి సెట్స్‌లో ఉన్నప్పుడు ప్రభాస్‌ను అప్పుడప్పుడు ‘ప్రభాస్ రాజు గారు’ అని పిలిచేవాళ్ళట. అలా పిలిచిన ప్రతిసారి ప్రభాస్ చాలా ఇబ్బంది పడేవాడట.
తన విషయంలో దయచేసి రాజు అనే పదాన్ని ఉపయోగించొద్దని రిక్వెస్ట్ చేసేవాడట. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అని చాలా సందర్భాల్లో తనకు కుల పిచ్చి లేదనే విషయం నాకు అర్ధమైందని జక్కన్న తెలిపారు.